కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఈటెల రాజేందర్

కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఈటెల రాజేందర్
X

కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా గాలి ద్వారా వ్యాపించదని.. కేవలం వైరస్ సోకిన వ్యక్తి నోటి తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని అన్నారు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైరస్ సోకిన వ్యక్తి వస్తువులు, టవల్స్ ను వాడకూడదని అన్నారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు.

కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా వుందన్నారు ఈటెల. కరోనా సోకినవారిలో చికిత్స తర్వాత 81 శాతం మంది బయటపడ్డారని అన్నారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే.. అన్ని పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ట్రీట్ మెంట్ తీసుకున్నవారిలో కేవలం మూడు శాతం మందికి మాత్రమే రిస్క్ ఎక్కువగా వుంటుందని అన్నారు. జలుబు చేసినవారు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని.. తుమ్మినప్పుడు కర్చీప్ అడ్డుపెట్టుకోవాలని సూచించారు.

ఇప్పటివరకు తెలంగాణవాసులెవరికీ కరోనా వైరస్ సోకలేదన్నారు ఈటెల రాజేందర్. కేవలం బయటి నుంచి వచ్చిన వ్యక్తిలో మాత్రమే వైరస్ ను గుర్తించామని అన్నారు. కరోనా వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉన్నామని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Tags

Next Story