బెంగళూరు తరహాలో మెట్రోరైలులో చర్యలు చేపట్టాలి: మంత్రి కేటీఆర్

బెంగళూరు తరహాలో మెట్రోరైలులో చర్యలు చేపట్టాలి: మంత్రి కేటీఆర్

తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదవ్వడంతో ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను చైతన్యం చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది. మరోవైపు స్వయనా మంత్రి కేటీఆర్‌.. తన సోషల్‌ మీడియా ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మెట్రో రైలు, ఆర్టీసీ అధికారులకు మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

కరోనా వైరస్‌ దృష్ట్యా బెంగళూరులో ఆర్టీసీ బస్సులను అధికారులు ప్రత్యేకంగా శుభ్రంచేస్తున్నారని గుర్తు చేస్తూ ఆ ఫోటోను పోస్ట్‌ చేశారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌ మెట్రోరైలులో చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ కోరారు. అదేవిధంగా ఆర్టీసీకి తగు సూచనలు చేయాలంటూ రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను మంత్రి ట్విట్టర్‌ ద్వారా కోరారు.

Tags

Read MoreRead Less
Next Story