కరోనా ఎఫెక్ట్.. హోలీ పండగలో పాల్గోనన్న మోదీ

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి హోలీ పండుగలో పాల్గొననని ప్రకటించారు. ప్రజలు ఒక సమూహంగా గుమిగూడవద్దని.. అలా అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు ఇదే అంశాన్ని సూచించినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. అందుకే ఈసారి ఎటువంటి హోలీ కార్యక్రమాల్లో పాల్గొననని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.
హోలీ పండుగలో ప్రజలు గుంపులుగా చేరి రంగులు చల్లుకుంటుంటారు. అలా గుంపులుగా చేరితే వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్న ఉద్దేశంతోనే ప్రధాని హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రజలు కూడా దూరంగా ఉండాలని ప్రధాని పరోక్షంగా సూచన చేసినట్లు ఈ ట్వీట్‌తో స్పష్టమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com