అమాంతంగా పెరిగిన మాస్క్‌ల ధరలు.. ప్రజల నుంచి కొత్త డిమాండ్లు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కుడా ప్రవేశించింది. ఈనేపథ్యంలో ప్రజలు కరోనా బారిన పడకుండా వైద్య అధికారులు అని ఏర్పాట్లు చేశారు. విశాఖ పర్యటక ప్రాంతం కావడంతో ప్రభుత్వ హాస్పిటల్స్ లో అత్యవసర వైద్య సదుపాయం కుడా కల్పించారు. మరో పక్క జిల్లా యంత్రాంగం కుడా అధికారులతో ఎప్పటికప్పుడు కరోనాపై సమీక్షలు నిర్వహిస్తోంది.
విశాఖలోని కేజిహేచ్, చెస్ట్ హాస్పటల్స్ లో కరోనా వైరస్ కి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించారు. ఎవరికైన కరోనా లక్షణాలు వచ్చినట్లు అన్పించిన వెంటనే ఈ హాస్పటల్స్ కి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. గత రాత్రి కుడా శ్రీలంక నుంచి విశాఖ వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా వైరస్ లక్షణాలు కన్పించడంతో విశాఖ ఛాతి హాస్పిటల్ లో అత్యవసర వైద్యం అందించారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయట తిరగాలంటేనే భయపడుతున్నారు. కరోనా వైరస్ భయంతో ప్రజలు మాస్క్‌లు కొనేందుకు ఎగబడుతున్నారు. వ్యాపారులు ప్రజల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. మాస్క్‌ల ధరలు విపరీతంగా పెంచేశారు. అయినా ప్రజలు మాస్క్‌లను ఎగబడి కొంటున్నారు. దీంతో విశాఖలో మాస్క్‌ల కొరత ఏర్పడింది. 20 రూపాయల మాస్క్ ని 300 నుంచి 500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
మాస్క్ ల విక్రయాలు.. వాటి ధరలపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని నగర వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం కరోనా వైరస్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నారు. మరోవైపు ప్రజలకు ఉచితంగా మాస్క్‌లు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com