కరోనాపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం

కరోనాపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం

కోరానా వైరస్‌ను నిలవరించేందుకు.. తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ కోఠిలోని DME కార్యాలయంలో కరోనాపై వైద్య సిబ్బందితో.. హెల్త్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంత కుమారి సమావేశమయ్యారు. DME రమేష్‌ రెడ్డి, DH శ్రీనివాస్‌రావుతోపాటు ఇతర అధికారులు సమావేశమయ్యారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి హెల్త్ సూపర్ వైజర్లు, సిబ్బంది కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనాపై ప్రజల్లో ఏ విధంగా అవగాహన కల్పించాలో.. సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు డైరెక్టర్‌ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ కరోనా నిర్ధరణ కమిటీ వేసింది. ఇందులో ఆరుగురు సభ్యులుంటారు. కమిటీలో వైరాలజీ ల్యాబ్‌, మైక్రో బయాలజీ HODలు ఉంటారు. వీరితో భేటీ అయిన DME తాజా పరిస్థితిపై చర్చించారు.

Tags

Next Story