ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతో కరోనాపై ఆందోళన చెందుతున్న ప్రజలు

ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతో కరోనాపై ఆందోళన చెందుతున్న ప్రజలు

ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం కరోనా వ్యాప్తికి ప్రత్యక్షంగా దోహదం చేస్తోంది. పది రోజుల క్రితం ఇటలీ నుంచి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు వచ్చిన యువతి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. దీంతో.. ఆమె తండ్రి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తన కూతుర్ని ఐసోలేటెడ్‌ వార్డులో చేర్చుకోమని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను బ్రతిమాలాడు. అయితే.. ఇక్కడ ఐసోలేటెడ్‌ సౌకర్యం లేదని విజయవాడలో మాత్రమే ఉందని ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. కనీసం పేషెంట్‌ దగ్గర నుంచి ఎలాంటి వివరాలు సేకరించలేదు. దీంతో.. ఆ యువతి ఆస్పత్రిలో కాసేపు కూర్చుని వెళ్లిపోయింది.

Tags

Next Story