స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ హైలెవెల్ కమిటీ
BY TV5 Telugu6 March 2020 7:26 PM GMT

X
TV5 Telugu6 March 2020 7:26 PM GMT
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ కసరత్తు ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, లోకేష్, వర్ల రామయ్యతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో తొలిసమావేశం నిర్వహించారు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో చర్చించారు. ఐదు పార్లమెంటు స్థానాలకు ఒక ఇన్‌ఛార్జ్ చొప్పున ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. కాసేపట్లో ఎన్నికల సంఘం సమావేశానికి ఆలపాటి రాజా, వర్ల రామయ్య వెళ్లనున్నారు. మరోవైపు ఎన్నికలు వాయిదా వేయాలంటూ సీఎం జగన్‌కు టీడీపీ బీసీ నేతలు బహిరంగ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలని వారంతా లేఖలో కోరారు.
Next Story