నెల్లూరులో టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కార్యకర్తల ఆందోళన

X
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు ఆగడం లేదు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని టీడీపీ మండల కార్యదర్శి వెంకట సుబ్బయ్యను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అధికారపార్టీ నేతల ఆదేశాలతోనే పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సుబ్బయ్యను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ మాజీ మంత్రి పరసా రత్నం, వేనాటి సతీష్ రెడ్డిలు పోలీసులను నిలదీశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
