గుంటూరు జిల్లాలో టీడీపీ ఎంపీపీ అభ్యర్థి అరెస్ట్.. ఉద్రిక్తత

గుంటూరు జిల్లాలో టీడీపీ ఎంపీపీ అభ్యర్థి అరెస్ట్.. ఉద్రిక్తత

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ.. అరాచకాలకు తెరలేపుతోంది అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గుంటూరు జిల్లాలోని నగరంలో టీడీపీ ఎంపీపీ అభ్యర్థిని అక్రమంగా అరెస్టు చేశారంటూ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలు భారీగా మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల చౌదరి ఇంట్లో మద్యం బాటిల్స్‌ పెట్టి.. అక్రమంగా కేసులో ఇరికించారు అంటూ వారు ఆందోళనకు దిగారు. వెంటనే ఆళ్ల చౌదరిని విడుదల చేయాలి అంటూ డిమాండ్‌ చేశారు.

Tags

Next Story