ఆంధ్రప్రదేశ్

బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
X

వైసీపీ ప్రభుత్వం పొగరుబోతు ఎద్దులా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని.. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన దిక్కులేదని ఆరోపించారు. అనేక ఇబ్బందులు పడి నామినేషన్లు వేసినా.. స్క్రూటినీలో తీసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కన్నా. ఇంతటి దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా, ఎప్పుడూ చూడలేదన్నారు . ఏకగ్రీవం కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, పోలీసులను అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తున్నారని ఫైరయ్యారు కన్నా.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చివరికి నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితులు తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. ఇప్పటికే నామినేషన్లు వేసిన వాళ్లు ధైర్యంగా నిలబడాలని.. దెబ్బలుతిన్నా బలంగా నిలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు పవన్. అలాగే గవర్నర్‌, డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES