ఒక్కో పార్టీకి ఒక్కో రూల్ అనుసరిస్తున్న పోలీసులు

X
అధికారంలో ఉన్నాం కదా.. తాము చెప్పిందే చట్టం.. తాము చేసిందే శాసనం అన్నట్టుగా సాగుతోంది వైసీపీ నేతల తీరు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం టీడీపీ అభ్యర్థుల తరపున నామినేషన్‌కు హాజరైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనితను పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలోకి పోలీసులు అడుగుపెట్టనివ్వలేదు. నిబంధనలు ఒప్పుకోవని కొత్త రూల్స్ చెప్పారు పోలీసులు. అదే సమయంలో.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌కి మాత్రం రెడ్ కార్పెట్ పరిచారు. పోలీసుల తీరుపై.. మాజీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని ఉద్యోగాలు చేస్తున్నట్టుగా ఉందని అనిత మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
