అనంతపురంలో కరోనా లక్షణాలు.. ఆందోళనలో ప్రజలు
BY TV5 Telugu13 March 2020 2:20 PM GMT

X
TV5 Telugu13 March 2020 2:20 PM GMT
అనంతపురం జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కదిరిమండలం పరాకువాండ్లపల్లిలో.. సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతుండటంతో ఇంటింటి సర్వేలో వైద్యులు గుర్తించారు. దీంతో.. అబ్దుల్‌ను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించి ప్రత్యేక వార్డులో ఉంచారు. సయ్యద్ అబ్దుల్ హైదారాబాద్‌లోని ఓ బేకరిలో పనిచేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న నేపాల్‌కు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరాడు.
అయితే.. అతన్ని పరామర్శించేందుకు ఆసుపత్రి వెళ్లిన సయ్యద్.. ఆ తర్వాత నుంచి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. రోజుకురోజుకు అనారోగ్యం క్షీణిస్తుండటంతో.. రెండ్రోజుల క్రితమే సొంతఊరైన పరాకువాండ్లపల్లి వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో.. గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Next Story