శ్రీకాళహస్తీలో జనసేన నేతలపై వైసీపీ దాడి

శ్రీకాళహస్తీలో జనసేన నేతలపై వైసీపీ దాడి
X

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలు వినుతపై దాడి చేశారు. ఆమె కారుపై రాళ్లతోదాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. అడ్డుకోబోయిన జనసేన నేత మహేష్‌పైనా కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆయన్ను చికిత్స కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇది ప్రజారాజ్యమా లేక నియంత రాజ్యమా అని నిలదీశారు జనసేన నాయకురాలు వినుత. పక్కా ప్లాన్ ప్రకారమే తమపై దాడి చేశారని ఆరోపించారామె.బైక్‌లపై వచ్చిన వైసీపీ కార్యకర్తలు రాడ్లు, కర్రలతో దాడి చేశారని చెప్పారు. జనసేన నేతల్ని కాపాడాపంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేదని వాపోయారు.

Tags

Next Story