స్థానిక ఎన్నికలు కూడా నిర్వహించలేని స్థితిలో అధికారులు ఉన్నారు: జీ.వీ ఆంజనేయులు

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు కూడా సమర్ధవంతంగా నిర్వహించలేని దీన స్థితిలో పోలీసులు, అధికారులు ఉండడం సిగ్గుచేటని గుంటూరు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు అన్నారు. 13 జిల్లాలలో ఎన్నికలను నిష్ఫక్షపాతంగా నిర్వహించలేని స్థితిలో ఎలక్షన్ కమిషన్ ఉండడం చాలా దురదృష్టకరమైన విషయమని పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ అభ్యర్ధులపై దాడులు చేస్తున్నారాష్ట్ర ఎన్నికల కమిషన్ నిలువరించలేకపోయిందని విమర్శించారు. పోలీసుల సాక్షిగా వైసీపీ గూండాలు ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధుల చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేస్తుంటే ఏమీ చేయలేని దీన స్థితిలో పోలీస్ వ్యవస్థ ఉండడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు వైసీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి ప్రతి ఒక్కరు విజ్ఞతతో ఓటు వేయాలని జి.వి ఆంజనేయులు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com