ఆంధ్రప్రదేశ్

మూడు సార్లు ఫిర్యాదు చేసినా.. గవర్నర్ స్పందించలేదు: యనమల

మూడు సార్లు ఫిర్యాదు చేసినా.. గవర్నర్ స్పందించలేదు: యనమల
X

స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్రాన్ని బాగు చేయడానికి ప్రజల ముందు ఇప్పుడున్న ఏకైక అవకాశమన్నారు టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు. రాష్ట్ర పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు.. గవర్నర్ స్పందించాలన్నారు. అప్రజాస్వామిక చర్యలపై గవర్నర్‌కు మూడు సార్లు ఫిర్యాదు చేసినా.. స్పందించని పరిస్థితి కనిపిస్తోందన్నారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు యనమల. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఏకైక కారకుడు సీఎం జగన్‌ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక న్యాయస్థానాలదే అన్నారు యనమల.

Next Story

RELATED STORIES