తెలంగాణ గడ్డపై ఏ ఒక్కరికీ కరోనా వైరస్ సోకలేదు: ఈటెల రాజేందర్

తెలంగాణ గడ్డపై ఏ ఒక్కరికీ కరోనా వైరస్ సోకలేదు: ఈటెల రాజేందర్

తెలంగాణ గడ్డపై ఏ ఒక్కరికీ కరోనా వైరస్‌ సోకలేదన్నారు వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని.. వారంతా విదేశాల నుంచి వచ్చినవారేనని తెలిపారు. దుబాయి, ఇటలీ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చిన ఐదుగురికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. అన్ని రాష్ట్రాల కన్నా ముందే తెలంగాణలో థర్మల్‌ స్క్రీనింగ్ ప్రారంభించామని.. సీఎం ఆదేశాలతో కరోనా కట్టడికి నిరంతరం పని చేస్తున్నామని తెలిపారు. ఇకపై ప్రతి రోజు మూడు పూటలా కరోనా బులెటిన్‌ విడుదల చేస్తామన్నారు ఈటెల. వైరస్‌ అనుమానం ఉన్నవారు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వరంగల్‌లో కరోనా టెస్ట్‌ ల్యాబ్‌ కోసం కేంద్రం అనుమతి తీసుకున్నామని.. మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కరోనాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని హెచ్చరించారు ఈటెల.

Tags

Read MoreRead Less
Next Story