కౌలాలంపూర్‌ ఎయిర్‌పోర్టులో భారతీయులు పడిగాపులు

కౌలాలంపూర్‌ ఎయిర్‌పోర్టులో భారతీయులు పడిగాపులు

మలేషియాలో భారతీయుల కష్టాలు కొనసాగుతున్నాయి. వందలాది మంది కౌలాలంపూర్‌ ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. కరోనా భయంతో పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమానాలను కేంద్రం నిలిపివేసింది. దీంతో విశాఖకు చెందిన సింధుషా అక్కడే చిక్కుకుపోయింది. వీసా రెన్యువల్ కోసం వారం క్రితమే ఆమె మలేషియా వెళ్లింది. సింధుషాకు 7 నెలల వయసున్న ఇద్దరు కవలలు ఉన్నారు. కరోనా భయంతో పిల్లల్ని విశాఖలోనే వదిలి మలేషియా వెళ్లింది.

సింధుషాతో పాటు మరికొందరు భారతీయులు కూడా కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. భారత్‌కు వచ్చే అవకాశం లేక అక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం చొరవ తీసుకొని తమను ఇండియాకు రప్పించే ఏర్పాట్ల చేయాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story