ఆంధ్రప్రదేశ్

విశాఖ పోలీసులపై కలెక్టర్‌కి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే

విశాఖ పోలీసులపై కలెక్టర్‌కి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే
X

విశాఖలో ఎక్సైజ్‌ పోలీసుల తీరుపై జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌కు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఫిర్యాదు చేశారు. టీడీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోదాలు చేసే పోలీసులు సీసీ కెమెరాలను ఎందుకు ఆపారాని ఆయన ప్రశ్నించారు. తప్పుచేస్తే స్టేషన్‌కు తీసుకెళ్లాల్సిన పోలీసులు.. వారిని ముడసర్లోవ తీసుకెళ్లడంపై అనుమానాలు ఉన్నాయంటూ కలెక్టర్‌కు వివరించారు.

విశాఖలో అధికార పార్టీ అరాచకాలపై ఆయన మండిపడ్డారు. సీఎం జగన్‌ ఎన్ని అడ్డదారులు తొక్కినా స్థానిక ఎన్నికల్లో నెగ్గలేరని వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు.

Next Story

RELATED STORIES