కరోనా ప్రభావంతో పనామాలో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులు

కరోనా ప్రభావంతో పనామాలో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులు

కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీంతో వివిధ దేశాల్లో పర్యటిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హస్తకళల విక్రయం, ప్రదర్శన కోసం పెరూదేశం వెళ్లిన తెలంగాణాకు చెందిన పలువురు అక్కడే చిక్కుకుపోయి.. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు పెరియా ఇండియా 2020 ప్రదర్శనలో పాల్గొనేందుకు యాదాద్రిజిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన గడ్డం భారతి, వర్కాల విజయలక్ష్మితోపాటు.. జహీరాబాద్ కు చెందిన శకుంతల, కొత్తగూడెంకు చెందిన సుభద్ర, సిద్దిపేటకు చెందిన మల్లేశంలు వెళ్లారు. కరోనా ప్రభావంతో ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేయడంతో వారు తిరుగు ప్రయాణంలో పనామాలో చిక్కుకుపోయారు. వారి రాక కోసం వారి బంధువులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story