ఆంధ్రప్రదేశ్

సాగరతీరంలో వైసీపీ అలజడులు

సాగరతీరంలో వైసీపీ అలజడులు
X

ప్రశాంత సాగరతీరంలో వైసీపీ నాయకులు అలజడి సృష్టిస్తున్నారు. విశాఖలో అధికార పార్టీ అరాచకాలు అడ్డూ, అదుపూ లేకుండా సాగుతున్నాయి. జిల్లాలో చాలా చోట్ల ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రోలుగుంట మండలంలో జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన జనసేన అభ్యర్థిని బెదిరిస్తున్నారు. నామినేషన్ వెనక్కి తీసుకోవాలంటూ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బెదిరించారని జనసేన అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో జిల్లాలో చాలాచోట్ల వైసీపీ నాయకులకు బెదిరంపులకు పాల్పడుతున్నారని.. జిల్లా ఎస్పీ బాబుజీకి జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే.. మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని జనసేన నేతలు అంటున్నారు.

Next Story

RELATED STORIES