కలిసి కట్టుగా కరోనాను తరిమి కొడదాం: చిరంజీవి

కలిసి కట్టుగా కరోనాను తరిమి కొడదాం: చిరంజీవి
X

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు.. సామాజిక బాధ్యతగా ఇప్పటికే పలువురు సినీ తారలు వీడియోలు పోస్టులు పెట్టారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. వైరస్‌ వ్యాప్తితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. నివారణ చర్యలతో కరోనాను దైర్యంగా ఎదుర్కొందామని అన్నారు. కలిసి కట్టుగా వైరస్‌ను తరిమి కొడదామని పిలుపునిచ్చారు చిరు. జన సమూహాలకు ప్రజలు దూరంగా ఉండాలని.. అవసరం అయితే తప్ప.. బయటికి వెళ్లొద్దన్నారు. ఆరోగ్య సంస్థలు, అధికారులు సూచించిన ఆరోగ్య సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు చిరంజీవి.

Tags

Next Story