తక్కువ ధరలకే అందించేందుకు విశాఖ జిల్లాలో కరోనా మాస్క్‌లు తయారీ

కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్కులకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. మార్కెట్లో ఉన్న ప్రస్తుత స్టాక్‌ను బ్లాక్ చేసి.. అధికధరలకు విక్రయించి వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో సాధరణ ధరకు మాస‌్క్ లు మార్కెట్లో దొరకక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వీటి తయారీపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. విశాఖ జిల్లా కె.కొటాపాడులో మహిళా, ఉత్పత్తి కేంద్రంలో మాస్క్‌లు తయారీ మొదలెట్టారు.
అతి తక్కువ సమయంలో అతి తక్కువ ధరలకు మాస్క్‌లు అందించే ప్రయత్నానికి నడుం బిగించారు. గతంలో స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా మాస్క్‌లు విరివిగా సప్లై చేశారు. ఇప్పుడు కరోనా విజృంభణతో మళ్లీ మాస్క్‌లకు డిమాండ్ పెరిగింది. తాము తయారు చేసే మాస్కుల్లో రాష్ట్రంలోనే కాకుండా వివిధ దేశాలకు కూడా సప్లై చేస్తున్నామని.. తాము విదేశాల నుంచి తెప్పించిన ప్రత్యేకమైన వస్త్రంతో మాస్క్‌లు తయారీ చేపడుతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com