ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లాలో కలకలం.. ఓ యువతికి కరోనా లక్షణాలు

గుంటూరు జిల్లాలో కలకలం.. ఓ యువతికి కరోనా లక్షణాలు
X

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నెల్లూరులో ఓ యువకుడు కరోనా వైరస్‌తో చికిత్స పొందుతుండగా ఒంగోలులో మరో వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక గుంటూరు జిల్లాలోనూ ఓ యువతికి కరోనా లక్షణాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. పాత మంగళగిరికి చెందిన ఓ యువతి ఇటీవలే అమెరికా నుంచి వచ్చింది. ఆమె తీవ్రమైన దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వైద్య పరీక్షల కోసం గుంటూరు తరలించారు. అయితే, దీనికి సంబంధించిన వివరాలేమీ అధికారులు బయటకు చెప్పడం లేదు. అటు పాత మంగళగిరిలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపడుతున్నారు మున్సిపల్‌ అధికారులు.

Next Story

RELATED STORIES