కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో ఇక అడుగడుగునా ఆంక్షలే

చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇకపై ఆంక్షలు మరింత కఠిన తరం చేయాలని ఆలోచిస్తోంది. విదేశాల నుంచి వస్తున్న వారిని అధికారులు ట్రాక్ చేస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారం తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. గ్రామస్థాయి నుంచే సమాచారం సేకరిస్తున్నారు. అలాగే హోటళ్లు కూడా మూసివేయించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రవాణా మార్గాలపైనా ఆంక్షలు విధించే అవకాశం కనబడుతోంది. గూడ్స్ వాహనాలకు మాత్రం అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రజా రవాణాలో భాగమైన ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేయాలనుకుంటోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ ఆంక్షలను హైదరాబాద్‌లో మరింత సీరియస్‌గా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com