ఆంధ్రప్రదేశ్

నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని బీజేపీ అభ్యర్థికి వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు

నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని బీజేపీ అభ్యర్థికి వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
X

అనంతపురం జిల్లాలో వైసీపీ ఆగడాలు ఆగడంలేదు. కదిరి నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన తమ అభ్యర్థులను విత్‌డ్రా చేసుకోవాలని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఫోన్‌ చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారని హిందూపురం బీజేపీ ఇంఛార్జ్‌ వజ్ర భాస్కర్‌ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతల ప్రలోభాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కేంద్ర బలగాలతో ఎలక్షన్‌ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Next Story

RELATED STORIES