ట్రీట్‌మెంట్ కంటే ముందు జాగ్రత్తలు చాలా అవసరం: ఈటెల రాజేందర్

ట్రీట్‌మెంట్ కంటే ముందు జాగ్రత్తలు చాలా అవసరం: ఈటెల రాజేందర్
X

కరోనా వైరస్ ను కట్టడి చేసే విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వుందన్నారు వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్. ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పట్టించుకోవాలని.. లేదంటే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా వుంటుందని అన్నారు. ఇటలీలో పరిస్థితులను అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రీట్ మెంట్ కంటే ముందు జాగ్రత్తలు చాలా అవసరమని చెప్పారు.

ఇప్పటివరకు తెలంగాణలో ఉన్నవాళ్లకు కరోనా సోకలేదని.. విదేశాల నుంచి వచ్చినవారికి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు ఈటెల. డాక్టర్లు ప్రజల్ని చైతన్యం చేయాలని సూచించారు. కరోనాను ఎదుర్కోనేందుకు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. తెలంగాణలో ఆరు ల్యాబ్ లు ఏర్పాటు చేశామన్నారు. కరోనా బాధితులంతా కోలుకుంటున్నారన్న ఈటెల.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 18కి చేరాయని అన్నారు.

Tags

Next Story