కరోనా ప్రభావంతో అమరావతి జేఏసీ కీలక నిర్ణయం

కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అమరావతి జేఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి శిబిరంలో నియమిత సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొంటారని తేలిపింది. ఒక్కొక్కరికి మధ్య 3 మీటర్ల దూరం పాటించాలని నిర్ణయించారు. రోజూ రాత్రి 7:30కి అమరావతి వెలుగు పేరుతో.. ప్రతి ఇంటిముందు కొవ్వత్తులు వెలిగించి నిరసనలు తెలుపనున్నారు. ఉద్యమం రూపుమారుతుందే కానీ.. ఉద్యమం మాత్రం కొనసాగుతుంది జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
కరోనా నివారణకు ప్రధాని చేసిన సూచనలను పాటిస్తాసమని తెలిపారు జేఏసీ నాయకులు. జనతా కర్ఫ్యూకి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. కర్ఫ్యూ సమయానికి ముందు, తర్వాత శిబిరాల్లో గంటపాటు కూర్చోవాలని నిర్ణయించారు..వందో రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై చర్చిస్తామన్నారు.. ప్రధాని మోదీ సూచన మేరకు పాటిస్తున్న జాగ్రత్తలను ప్రస్తావిస్తూ ఆయనకు లేఖ రాయనున్నారు జేఏసీ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com