ఆంధ్రప్రదేశ్

విశాఖలో విస్త‌ృతం చేస్తున్న కరోనా పరీక్షలు

విశాఖలో విస్త‌ృతం చేస్తున్న కరోనా పరీక్షలు
X

విశాఖ చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ వ్యక్తి ఆరోగ్యం కుదుటపడుతోంది. అటు బాధితుడి కుటుంబ సభ్యులు కూడా వైద్యుల పర్యవేక్షణలో వున్నారు. దీంతో వివేకానందనగర్ లోని బాధితుడి ఇంటికి మూడు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. అటు నగరంలోని షాపింగ్ మాల్స్ మూతపడటంతో రైతు బజార్లు కిటకిటలాడుతున్నాయి. నిత్యావసర వస్తువులు కొనేందుకు నగరవాసులు క్యూ కడుతున్నారు.

ఇక, 28వ వార్డులో 141 వైద్యబృందాలు ఇంటింటి తనిఖీలు చేపట్టాయి. పూర్తిస్థాయిలో ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఏమాత్రం వున్నా ఆసుపత్రికి తరలిస్తున్నారు. 27, 29 వార్డులను కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు శనివారం నుంచి 44, 19 వార్డులలో వైద్య సర్వేలు మొదలు కానున్నాయి. అటు, పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి.

ఇదిలావుంటే, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం విశాఖ విమానాశ్రయాన్ని పరిశీలించారు. ప్రయాణికుల వైద్య పరీక్షలపై ఆరా తీశారు. వైద్య సిబ్బందిని పెంచాలని ఆదేశాలు జారీచేశారు. ఎంబీబీఎస్‌ లు కాకుండా ఎండీలను నియమించాలని.. డీఎంహెచ్‌ఓ కు సూచించారు. అటు విదేశీ, స్వదేశీ ప్రయాణికులందరినీ తనిఖీ చేయాలని ఆదేశించారు మంత్రి శ్రీనివాస్ రావు.

Next Story

RELATED STORIES