గాయని కనికా కపూర్‌పై పోలీసు కేసు నమోదు
బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఐపీసీ 188,269,270 సెక్షన్ ప్రకారం సరోజిని నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు లక్నో పోలీసులు తెలిపారు. అలాగే చట్టంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గుమికూడి ఉండటం వంటి చట్టాల ప్రకారం కనికా కపూర్‌పై మరో రెండు FIRలు కూడా నమోదు చేశారు.
ఇటీవలె విదేశాల నుంచి వచ్చిన ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు.. శుక్రవారం తెలిసింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో కలకలం రేగింది. ఇటీవల ఆమె లక్నోలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్‌కు పాల్గొన్నారు. దీంతో వాళ్లిద్దరూ ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. మరోవైపు కనికా బాధ్యతారాహిత్యంపై.. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారు కచ్చితంగా రెండు వారాలపాటు స్వీయ నిర్బంధం పాటించాలని కేంద్రం హెచ్చరిస్తున్నా.. కనికా కపూర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కనికా మాత్రం తన తప్పు ఏమీలేదని బుకాయిస్తున్నారు. పది రోజుల క్రితం ఎయిర్‌పోర్ట్‌లో వచ్చినపుడు ఎలాంటి లక్షణాలు లేవని.. నాలుగు రోజుల క్రితం ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షల్లో కరానో వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com