తెలంగాణలో 44కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో 44కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. బుధవారం రాత్రి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని సంతోషపడే లోపే రాత్రి రెండు పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇక, గురువారం ఇప్పటికే మరో మూడు కేసులు జతకలిశాయి. దీంతో తెలంగాణలో కరోనా బారిన పడినవారి సంఖ్య 44కు చేరింది. కుత్బుల్లాపూర్ కుచెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవలే అతను ఢిల్లీ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుంది.

ఇక, దోమల్ గూడకు చెందిన ఇద్దరు డాక్టర్లకు కాంటాక్ట్ ద్వారా కరోనా సోకింది. భార్యాభర్తలయిన వీరిద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా వున్నట్టు తెలుస్తోంది. వీరితో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 44 కు చేరాయి. అయితే, వీరిలో ఒకరు ఇప్పటికే డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 43 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story