కరోనా ఎఫెక్ట్ : ఎన్‌పీఆర్, జనగణన వాయిదా
By - TV5 Telugu |26 March 2020 8:30 AM GMT
కరోనా ఎఫెక్ట్.. జనగణన, జాతీయ పౌర పట్టిక ఎన్పీఆర్ నమోదు ప్రక్రియపై పడింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), 2021 మొదటి దశ జనగణనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరుగాల్సిన జనగణన, ఎన్పీఆర్ నమోదు ప్రక్రియను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు భారత జనగణన కమిషన్ రిజిస్ట్రార్ జనరల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2020-21 జన గణ నలో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు గృహ గణన ప్రక్రియ చేపట్టాలి. రెండవ విడతగా వచ్చే ఏడాది ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నుంచి 28 వరకు జన గణన జరుగాల్సి ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com