తెలంగాణలో 47కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో 47కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 47కు చేరింది. కరోనా కేసులు వచ్చిన తర్వాత సీఎం ఆధ్వర్యంలో హైలెవెల్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు ఉన్నాయని.. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఉన్న పరికరాలు.. వైద్య సిబ్బంది సహకారం అందిస్తామని ముందుకు వచ్చారని వెల్లడించారు. ఫస్ట్ ఫేజ్‌ కింద ప్రభుత్వ ఆస్పత్రులు.. సెకండ్‌ ఫేజ్ కింద ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలను వాడుకుంటామన్నారు. కరోనా కోసం 10 వేల బెడ్లు, ఐసీయూకు 700 బెడ్లు, వెంటిలేటర్ల కోసం 170 బెడ్లు ఇస్తామన్నారని.. ఒక వేళ కేసులు పెరిగితే ప్రైవేట్‌ కాలేజీలు ఉపయోగించుకుంటాని ఈటల స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story