కాంటాక్ట్ కేసులు గుర్తించాలంటే మీరు అలా చేయాలి: ఏపీ సీఎం జగన్

కాంటాక్ట్ కేసులు గుర్తించాలంటే మీరు అలా చేయాలి: ఏపీ సీఎం జగన్

ప్రజలందరూ ఎక్కడివారు అక్కడే ఉండాలన్నారు సీఎం జగన్ సూచించారు. ఎక్కడివారు అక్కడే ఉండిపోతేనే కరోనా వైరస్‌ను నిరోధించగలమన్నారాయన. కరోనాను సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ వైరస్‌ను క్రమశిక్షణతోనే గెలవగలమన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు సీఎం జగన్‌. ఇలాంటి సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని.. కరోనాపై చర్యలకు ప్రజలంతా సహకరించాలని సీఎం కోరారు. బుధవారం రాత్రి తెలంగాణ బోర్డర్‌లో చాలా మంది నిలిచిపోయారని.. వారిని మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించలేని పరిస్థితి ఉందన్నారు.

ఏప్రిల్‌ 14వరకు ఎక్కడివాళ్లు అక్కడే ఉండగలిగితే కరోనా కాంటాక్ట్ కేసులను గుర్తించగలుగుతామన్నారు. తిరగడం మొదలు పెడితే గుర్తించడం కష్టం అవుతుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి వచ్చినవారందరినీ క్వారంటైన్‌కు తరలించకతప్పదన్నారు సీఎం జగన్‌. టెస్టులు చేయించుకున్న తర్వాతే స్వస్థలాలకు వెళ్లాలన్నారు.

దేశం ఎక్కడ చిక్కుకున్నవారైనా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే.. కేంద్రం వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు కేవలం 10 కేసులే నమోదయ్యాయని.. కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా ఉంచామన్నారు.

Tags

Next Story