కరోనా ఎఫెక్ట్.. పోలీస్ అధికారులు సస్పెండ్

కరోనా ఎఫెక్ట్.. పోలీస్ అధికారులు సస్పెండ్

ఏపీలో కరోనా విస్తరిస్తరిస్తున్న సమయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారి డాటా సేకరించే విషయంలో విధులను విస్మరిస్తున్నారు. అలాంటి పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్నారు ఉన్నతాధికారులు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సీఐ సురేంద్ర బాబును సస్పెండ్ చేసి.. వీఆర్ కు పంపారు ఎస్పీ సిహెచ్ విజయరావు. విదేశాల నుండి వచ్చే వారి డేటా సేకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎవరిపైనేనా కఠిన చర్యలు తప్పవని జిల్లా రూరల్ ఎస్పీ విజయరావు హెచ్చరించారు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో యువకుడిపై లాఠీఛార్జ్‌ చేసిన పెరవలి S.I కిరణ్‌ను సస్పెండ్‌ చేశారు అధికారులు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ యువకుడు క్వారంటైన్‌‌లో లేడనే కారణంతో విచాక్షణా రహితంగా లాఠీతో బాధాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చివరికి వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. కిరణ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చినవారు ఎవరైనా రోడ్డుపై కనిపిస్తే క్వారంటైన్‌కు పంపాలని.. ఇలా దాడి చేయడం కరెక్టు కాదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారు డీజీపీ.

Tags

Next Story