కరోనా సోకిన ఇద్దరు వైద్యులను కలిసిన మరో ఇద్దరు వైద్యులు.. తిరుపతిలో కలకలం

కరోనా సోకిన ఇద్దరు వైద్యులను కలిసిన మరో ఇద్దరు వైద్యులు.. తిరుపతిలో కలకలం

తెలంగాణలో పాజిటివ్‌ లక్షణాలున్న ఇద్దరు వైద్యులు.. తిరుపతిలోని ఇద్దరు వైద్యులను కలవడం కలకలం రేపుతోంది. దీంతో తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లను క్వారంటైన్‌లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్లడ్‌ శాంపిల్స్‌ను పరీక్షల కోసం శుక్రవారం మధ్యాహ్నమే పంపించినా.. ఇంకా రిపోర్ట్‌ రాకపోవడంతో వైద్యుల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్న వైద్యులు.. ఈ నెల 17న తిరుపతికి వచ్చినప్పుడు ఎవరెవరినైనా కలిశారా అన్న కోణంలో పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags

Next Story