మత ప్రచారంలో పాల్గొన్న వ్యక్తికి కరోనా పాజిటివ్.. తీవ్ర ఆందోళన

మత ప్రచారంలో పాల్గొన్న వ్యక్తికి కరోనా పాజిటివ్.. తీవ్ర ఆందోళన

గుంటూరులో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు నేపథ్యంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా పాజిటివ్‌ వ్యక్తితో కొందరు ఢిల్లీ వెళ్లివచ్చారు. వారిలో జిల్లాలోని మాచర్లకు చెందిన 8 మంది, మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన ఒకరు, తెనాలి నుంచి ఒకరు, పిడుగురాళ్లలో ఇద్దరు ఉన్నారు. అంతేకాకుండా కరోనా పాజిటివ్‌ వ్యక్తి గుంటూరు, తాడికొండలలో నిర్వహించిన మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నాడు. పాజిటివ్‌ ఉన్నవ్యక్తితో గడిపిన వారు స్వచ్ఛందంగా చికిత్సకు ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.

Tags

Next Story