ఒక్కరోజే తెలంగాణలో 10 కరోనా పాజిటివ్ కేసులు

ఒక్కరోజే తెలంగాణలో 10 కరోనా పాజిటివ్ కేసులు
X

భయంకరంగా విస్తరిస్తున్న కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 10 కరోనా కేసులు నమోదయ్యాయని అన్నారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరిందన్నారు. మరో 25 వేల మంది క్వారంటైన్ లో వున్నారని తెలిపారు. కర్ఫ్యూ కారణంగా కేసుల అదుపు సాధ్యమవుతోందన్న సీఎం.. ప్రజలకు ఇంకా సహకారం అందించాలని పిలుపునిచ్చారు. పెద్ద పెద్ద దేశాలే కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్ష అన్నారు. సామాజిక దూరం పాటించడం తప్ప కరోనా కట్టడికి వేరే మార్గం లేదన్నారు సీఎం కేసీఆర్.

Tags

Next Story