చెట్టును ఐసోలేషన్‌గా మార్చుకున్న కార్మికులు

చెట్టును ఐసోలేషన్‌గా మార్చుకున్న కార్మికులు

పశ్చిమబెంగాల్‌లోని పురులియా జిల్లాకు చెందిన ఏడుగురు కార్మికులు చెట్టుపైనే 14 రోజులుగా క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. చెన్నైలో పని చేసుకుంటున్న వారు ఇటీవల పురులియా జిల్లాకు వెళ్లారు. వారు గ్రామానికి వచ్చిన వెంటనే డాక్టర్ వారిని 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. అయితే ఐసోలేషన్ కోసం వారికి విడి గదులు లేవు. దీంతో వీరంతా ఓ నిర్ణయం తీసుకున్నారు.

గ్రామం దగ్గర్లోని ఓ చెట్టును ఐసోలేషన్ చోటుగా మార్చుకున్నారు. కార్మికులంతా చెట్టుపై కొమ్మలకు గుడ్డ కట్టి కూర్చోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఏ లోటు లేకుండా అంతా అక్కడ ఏర్పాట్లు చేసుకున్నట్లు వారు చెబుతున్నారు. ఇక్కడ సౌకర్యంగానే ఉంటున్నాం అని వారు అంటున్నారు. కరోనాను బ్రేక్ చేయడానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నానికి పలువురు అభినందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story