భారత్‌‌లో విస్తరిస్తున్న కరోనా

భారత్‌‌లో విస్తరిస్తున్న కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 873కు చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్‌తో 20 మంది చనిపోయారు. 74 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో నలుగురు, గుజరాత్‌లో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, బీహార్‌, పంజాబ్‌, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, జమ్మూకశ్మీర్‌, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కొక్కరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. గుజరాత్‌లో కొత్త మరో 6 కరోనా కేసులు వెలుగు చూశాయని, దీంతో ఇక్కడక కరోనా కేసులు 53కు చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది.

కర్ణాటకలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. శనివారం ఒక్క రోజే కర్ణాటకలో పది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అటు ఏపీలో 13 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 59 కేసులు నమోదయ్యాయి. ఇక నగరాలవారిగా చూస్తే... అహ్మదాబాద్‌లో అత్యధికంగా 18 , వడోదరలో 9, రాజ్‌కోట్‌ 8, గాంధీనగర్‌లో 8, సూరత్‌లో 7, భావ్‌నగర్‌ కచ్‌లతో ఒక్కో కేసు నమోదైంది. మొత్తం కేసుల్లో వంద కేసులు దుబాయ్‌ నుంచి వచ్చిన వారేనని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story