కరోనాపై యుద్ధానికి విరాళాల వెల్లువ

కరోనాపై యుద్ధానికి విరాళాల వెల్లువ

కరోనా బాధితుల కోసం పలువురు విరాళాలు అందజేస్తున్నారు. ఎంపీ లాడ్స్‌ నుంచి 2 కోట్ల నిధులను కేటాయించారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. ఏపీ, యూపీ రాష్ట్రాలకు చెరో కోటి రూపాయలు కేటాయించారు. ఏపీకి కేటాయించిన కోటి రూపాయలలో విశాఖ, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు 25 లక్షల చొప్పున కేటాయించారు. దీంతో పాటు నెల జీతం విరాళంగా ఇచ్చారు.

అటు.. కరోనా బాధితులకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ విరాళం ఇచ్చారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లక్ష చొప్పున ప్రకటించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. కరోనా చట్టడి చర్యల్లో భాగంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించాలన్నారు.

తెలంగాణ సీఎం సహాయ నిధికి సింగరేణి కార్మికుల విరాళం ఇచ్చారు. ఒక రోజు వేతనం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. 8.5 కోట్లు సీఎం సహాయ నిధికి ఇస్తామన్నారు.

దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్‌ టాటా కరోనా నివారణ కోసం భారీ ప్రణాళికతో ముందుకు వచ్చారు. దేశాన్ని ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకునేందుకు ఏకంగా ఐదు వందల కోట్లను వెచ్చించాలని నిర్ణయించారు. దేశ అవసరాల కోసం టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌, టాటా ట్రస్ట్‌ ఎప్పుడూ ముందుంటుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story