కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న కెనడా ప్రధాని భార్య సోఫీ గ్రెగొరీ

X
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగొరీ కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఈ మేరకు వైద్యుల నుంచి ధ్రువీకరణ కూడా వచ్చిందని ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. మార్చి 12న ఆమెకు కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆమెతో పాటు ప్రధాని ట్రూడో వారి పిల్లలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ట్రూడో ఇంత కాలం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. తన భార్య కోలుకున్న సందర్భంగా ప్రధాని ట్రూడో తన సిబ్బంది, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
