మద్యం దొరక్క తొమ్మిది మంది మృతి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజలపాటు లాక్ డౌన్ విధించింది. విమానాలు, రైళ్లు, బస్సులు, ప్రభుత్వం, ప్రైవేట్ కార్యాలయాలను బంద్ చేశారు. కేవలం నిత్యవసరాలు, మెడికల్ షాపులు మినహా మిగిలిన దుకాణాలన్నింటిని బంద్ చేయించారు. వీటితో పాటు మద్యం దుకాణాల్ని కూడా మూసివేయించారు. దీంతో మందు బాబులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మద్యం దొరక్క మందు బాబులు వింత ప్రవర్తనలతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. నిత్యం తాగుడుకు అలవాటుపడినవారు ఆకస్మాత్తుగా మందు దూరమయ్యేసరికి తట్టుకోలేకపోతున్నారు. కేరళలో ఈ పరిస్థితి మరి దారుణంగా ఉంది. అక్కడ మద్యం దొరక్కపోవడంతో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఆరుగురు మందుబాబులు ఆత్మహత్యాయత్నం చేశారు.
దీనిపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి మద్యం ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖను ఆదేశించారు. మద్యానికి బానిసైన వారిని డి- అడిక్షన్ సెంటర్‌లకు పంపాలని సూచించారు. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలను పరిశీలిస్తున్నామని సీఎం విజయన్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com