అన్ని బ్రాంచిల్లో కార్యకలాపాలు కొనసాగించాల్సిందే: బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు

అన్ని బ్రాంచిల్లో కార్యకలాపాలు కొనసాగించాల్సిందే: బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు

లాక్‌డౌన్ కొనసాగినంత కాలం అన్ని బ్యాంకులు తమ బ్రాంచిల్లో కార్యకలాపాలు కొనసాగించాలని.. ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకు ఖాతాల ద్వారానే ప్రజలకు జీతాలు, పెన్షన్‌లు అందుతాయని, అందువల్ల ప్రతి బ్యాంకు తమ బ్రాంచిలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయా యాజమన్యాలకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభత్వం ఉత్తర్వలు జారీ చేసింది. అయితే లాక్‌డౌన్ ఉన్నంత కాలం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నట్లు ప్రభుత్వ తన ఉత్తర్వుల ద్వారా తెలిపింది. ప్రభుత్వం తెలిపిన ఈ వార్తతో బ్యాంకు ఖాతా దారులకి కొంత ఊరట లభిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story