దుబారా ఖర్చులు తగ్గించుకోండి: శరద్ పవార్

దుబారా ఖర్చులు తగ్గించుకోండి: శరద్ పవార్

కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందని పలువురు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. తాజాగా కరోనా గురించి స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా మహా రాష్ట్రప్రజలుతో మాట్లాడిన శరద్ పవార్ కరోనా ఎఫెక్ట్ ఆర్థిక రంగంపై పడిందని.. అనవసర, దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ఇంటి పట్టునే ఉంటూ కరోనా వ్యాప్తిని అరికట్టాలని ఆయన ప్రజలకు సూచించారు. దేశవ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు స్తంభించిపోవటంతో ఆర్థిక రంగంపై తీవ్రంగా పడిందని అన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు.

Tags

Next Story