స్పెయిన్‌లో ఒక్క రోజే 812 మందిని పొట్టన పెట్టుకున్న కరోనా

X
కరోనా మహమ్మారి స్పెయిన్‌ను అతలాకుతలం చేస్తుంది. రోజురోజుకి కరోనా మరణాల సంఖ్య పెరుగుతుంది. సోమవారం ఒక్క రోజే 812 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో అక్కడ మరణాల సంఖ్య 7,340, వ్యాధి సోకిన వారి సంఖ్య 85,195కి చేరింది. ప్రతిరోజూ వ్యాధిసోకిన వారి సంఖ్య, మరణాల సంఖ్య వృద్ధిరేటు నెమ్మదిగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. దీంతో అక్కడ పరిస్థితులు దిగజారుతున్నాయి. కరోనా ప్రభావం పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. ప్రజల్ని నియంత్రించే బాధ్యత పూర్తిగా సైన్యానికి అప్పగించి.. వారికి అత్యవసర అధికారాల్ని కట్టబెట్టింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
