ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు పొడిగించాలి: పరిశ్రమల సంఘాలు

X
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని జూన్ 30వ తేదీ వరకు పొడిగించాలని పారిశ్రామిక సమాఖ్యలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సీఐఐ, ఫిక్కీ, అసోచాం ప్రతినిధులు.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ అధికారులను కలిసి కరోనా విజృంభిస్తన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సమస్యలను వివరించారు. కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు పలు సలహాలు, సూచనలు చేశారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగుస్తుంది. అయితే కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ స్థితిని పరిగణనలోకి తీసుకొని ఈ ఆర్థిక సంవత్సరాన్ని మరో మూడు నెలల పాటు అంటే జూన్ 30 వరకు పొడిగించాలని విన్నవించాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
