కరోనా కట్టడికి 20 కోట్ల విరాళం ప్రకటించిన హాల్

కరోనా కట్టడికి 20 కోట్ల విరాళం ప్రకటించిన హాల్
X

దేశ వ్యాప్తంగా విజృభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీని కోసం ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలు తమ వంతు సాయం చేస్తున్నాయి.

తాజాగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారీ విరాళం ప్రకటించింది. తమ సీఎస్‌ఆఱ్ ఫండ్స్ నుంచి 20 కోట్లను పీఎం కేర్ కు కేటాయిస్తున్నట్లు హాల్ తెలిపింది. దీంతో పాటు ఈ సంస్థలో పని చేస్తున్న ప్రతీ ఉద్యోగి కరోనా తో పోరాటం కోసం ఒకరోజు జీతాన్ని అందిస్తున్నారని తెలిపింది. ఈ మొత్తాని కూడా కలిపి రూ.26.65 కోట్లను విరాళంగా అందిస్తున్నట్లు హెచ్‌ఏఎల్ స్పష్టం చేసింది.

Tags

Next Story