కరోనా ఎఫెక్ట్: తీవ్రమవుతున్న ఆహారపు కొరత

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు రంగాలు దివాళా తీస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు కొరత తీవ్రమవుతోంది. ఇప్పుడే సరైన చర్యలు చేపట్టకపోతే ప్రపంచ దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించాయి. వైరస్ ను కట్టడి చేయడానికి పలు దేశాలు లాక్‌డౌన్ విధించడంతో ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ.. రానున్న సంక్షోభాన్ని అంచనా వేస్తున్నాయి. ఆహార పదార్థాల సరఫరాపై ఉన్న ఆందోళనల వల్ల ఇప్పటికే అన్ని సూపర్ మార్కెట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
‘ఆహార పదార్థాల కొరతను అధిగమించడానికి, ప్రజల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతాల మధ్య వాణిజ్యం సులభతరం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపాయి. ‘వ్యవసాయ, ఆహార పరిశ్రమకు చెందిన కార్మికుల రాకపోకలను కట్టడి చేయడం, ఆహార కంటైనర్ల రాకపోకలకు సరిహద్దుల వద్ద ఆలస్యం కావడంతో కొన్ని ఉత్పత్తులు పాడయ్యే అవకాశం ఉండటం ఈ సంక్షోభానికి కొన్ని కారణాలని ఆందోళన వ్యక్తం చేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com