కరోనా సోకినవారిపట్ల వివక్ష చూపింద్దు: సీఎం జగన్
కరోనా ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడిందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ మందగించిందని.. అనుకోని ఖర్చులు విపరీతంగా పెరిగాయని అన్నారు. జీతాలు వాయిదా వేసేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో రైతులు ఒంటిగంట దాకా పనులు చేసుకోవచ్చని, రైతులు, రైతు కూలీలు సామాజిక దూరం పాటించాలని జగన్ చెప్పారు. కరోనా సోకినవారిపట్ల వివక్ష చూపించొద్దని, ఆప్యాయత చూపాలని జగన్ స్పష్టం చేశారు.
వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని, వారు మీ బాగోగులు చూస్తారని సీఎం జగన్ చెప్పారు. ఏ ఇతర సమస్యలున్నా వాలంటీర్లకు చెప్పాలని తెలిపారు. 81 శాతం కరోనా కేసులు ఇంట్లో ఉంటేనే నయమవుతాయని, కరోనా వైరస్‌కు 14 శాతం మాత్రమే ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని జగన్ అన్నారు. 4, 5 శాతమే ఐసీయూలో చికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం పేర్కొన్నారు. పరిస్థితి విషమిస్తే వాలంటీర్లే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారని జగన్ స్పష్టం చేశారు.
కరోనా వస్తే తప్పుజరిగినట్లు భావించకూడదని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఏపీలో నమోదైన 87 కేసుల్లో 70 కేసులు ఢిల్లీ నుంచి వచ్చినవారికే పాజిటివ్ వచ్చిందని జగన్ చెప్పారు. ఢిల్లీ మీటింగ్‌కు ఏపీ నుంచి 1,085మంది వెళ్లి వచ్చారని, మొత్తం 585 మందికి పరీక్షలు చేశామన్నారు. 70 కేసుల్లో పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. మరో 500 కేసుల నివేదికలు రావాల్సి ఉందని, ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో 21 మంది కోసం గాలింపు చేపట్టామని సీఎం జగన్ పేర్కొన్నారు. 104కు ఫోన్ చేసి స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
రెండు రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వస్తే తప్పుజరిగినట్లు భావించకూడదని.. ఏపీలో నమోదైన 87 కేసుల్లో 70 కేసులు ఢిల్లీ నుంచి వచ్చినవారికే పాజిటివ్ వచ్చిందన్నారు. ఢిల్లీ మీటింగ్‌కు ఏపీ నుంచి 1,085మంది వెళ్లి వచ్చారన్నారు. మొత్తం 585మందికి పరీక్షలు చేశాం, 70 కేసుల్లో పాజిటివ్ వచ్చిందన్నారు. మరో 500 కేసుల నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో 21మంది కోసం గాలింపు చేపట్టామన్నారు. 104కు ఫోన్ చేసి స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకోవాలన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com