కామన్ మినిమమ్ రిలీఫ్ ప్రోగ్రాంను విడుదల చేయాలి: సోనియా గాంధీ

కామన్ మినిమమ్ రిలీఫ్ ప్రోగ్రాంను విడుదల చేయాలి: సోనియా గాంధీ
X

లాక్‌డౌన్ నేపథ్యంలో ‘కామన్ మినిమమ్ రిలీఫ్ ప్రోగ్రాం’ ను విడుదల చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడిన ఆమె.. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక.. ఆదాయ మార్గాలు తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. వీటితో పాటు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడం సరైన నిర్ణయం అయినప్పటికీ.. 21 రోజుల లాక్‌డౌన్‌ను ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే విధించారని, దీంతో కూలీల బతుకులు మరింత దుర్భరంగా మారాయని ఆమె అన్నారు.

ప్రయాణానికి ఎలాంటి వాహనాలు లేక.. వలస కూలీలు వందల కొలది కిలోమీటర్లు నడవడం చూస్తుంటే హృదయం తరుక్కుపోతోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘కామన్ మినిమమ్ రిలీఫ్ ప్రోగ్రాం’ ను విడుదల చేయాలని సోనియా డిమాండ్ చేశారు.

Tags

Next Story